🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 19 – 08 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
బహుళ పక్షం,
తిథి : *ఏకాదశి* సా4.10 వరకు,
నక్షత్రం : *ఆర్ద్ర* రా2.40 వరకు,
యోగం : *వజ్రం* రా10.56 వరకు,
కరణం : *బాలువ* సా4.10 వరకు,
తదుపరి *కౌలువ* తె3.16 వరకు,
వర్జ్యం : *ఉ11.49 – 1.20,*
దుర్ముహూర్తము : *ఉ8.16 – 9.07,*
మరల *రా10.54 – 11.40,*
అమృతకాలం : *సా5.09 – 6.40,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 5.46,
సూర్యాస్తమయం: 6.21,
*_నేటి విశేషం_*
*మంగళగౌరీ వ్రతం*
*అజ ఏకాదశి*
*కష్టాలను తొలగించే అజ ఏకాదశి*
మన సనాతన ధర్మంలో ఏకాదశి తిధికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
ప్రతి నెలలో శుక్ల పక్షలలో ఒక ఏకాదశి, కృష్ణ పక్షంలో మరొక ఏకాదశి ఇలా నెలకు రెండు ఏకాదశులు వస్తాయి.
ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు.
ఈ ఏకాదశి గురించిన విశిష్టతలు పద్మ పురాణంలో పేర్కొన్నారు.
ఈ పవిత్రమైన పర్వదినాన శ్రీమహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.
అజ ఏకాదశి రోజున వ్రతం ఆచరించిన వారికి అనేక సమస్యలనుండి విముక్తి లభిస్తుందని అనేక మంది విశ్వసిస్తారు.
ఈ పవిత్రమైన రోజున పవాసం ఉండటం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలం వస్తుందని, పూర్వ జన్మ పాపాలన్నీ తొలగిపోతాయని పురాణ వచనం.
ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, తలస్నానం చేయాలి.
పూజా గదిలో శ్రీమహా విష్ణువు విగ్రహం లేదా ఫొటోను ఉంచి, తాజా పువ్వులతో అలంకరించాలి.
అనంతరం దీపారాధన చేయాలి.
శ్రీమహా విష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి.
స్వామి వారికి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి, పూజా సమయంలో లక్ష్మీదేవి కథను చదవాలి.
చివరగా హారతి ఇచ్చి మీ ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి.
పురాణాల ప్రకారం అజ ఏకాదశి గురించి యుధిష్టరుని అభ్యర్థన మేరకు శ్రీ కృష్ణుడు చెప్పాడు.
ఈ వ్రతం పూర్వం హరిశ్చంద్ర దంపతులు ఆచరించారు, హరిశ్చంద్రుడు కొన్ని పరిస్థితుల్లో స్మశాన వాటికను చూసుకునేవాడు.
తన కుమారుడు పాము కాటుకు గురై చనిపోయాడు, తన భార్య కుమారుడిని అంత్యక్రియల కోసం తీసుకొచ్చినప్పుడు తన విధిని నిర్వర్తించాడు.
ఆ సమయంలో ఆకాశంనుంచి పూల వరం కురిసింది.
హరిశ్చంద్ర రాజు కష్టకాలంలో ఉండి, కష్టాలనుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నప్పుడు, గౌతమ ముని వచ్చి శ్రావణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున వ్రతం ఆచరించి, ఉపవాసం ఉండటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు.
గౌతమ ముని చెప్పిన విధంగా హరిశ్చంద్ర రాజు అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి కష్టాలనుండి బయటపడ్డాడు.
పవిత్రమైన అజ ఏకాదశి రోజున సిద్ధి, త్రిపుష్కర యోగాలు ఏర్పడతాయి.
ఈ యోగాల సమయంలో పూజ చేయడంవల్ల ఎంతో పుణ్య ఫలం లభిస్తుంది.
ఈ రెండు యోగాలవల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
*శ్రీకృష్ణ గోవింద హరే మురారే*
*హే నాథ నారాయణ వాసుదేవాయ..*
*ఓం నారాయణాయ విద్మహే*
*వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్*
*ఓం విష్ణవే నమః.*
*అజ ఏకాదశి రోజున ఈ మంత్రం జపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.*