స‌హ‌స్ర‌ను చంపింది ప‌దో త‌ర‌గ‌తి బాలుడే..!

కుకట్‌పల్లి సహస్ర హత్య కేసులో విస్తుపోయే విషయాలు

దొంగతనం కోసం వెళ్లి బాలికను హత్య చేసిన బాలుడు

సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్‌లోనే ఉంటున్న బాలుడు

దొంగతనానికి వెళ్ళేటప్పుడు తన వెంట కత్తి తీసుకెళ్లిన బాలుడు

సహస్ర తల్లిదండ్రులు బయటికి వెళ్లిన తర్వాత, ఇంట్లోకి చొరబడి రూ.80 వేలు దొంగతనం చేసిన పదవ తరగతి బాలుడు

దొంగతనం చేస్తుండగా బాలుడిని చూసి కేకలు పెట్టిన సహస్ర.. ఆమెపై కూర్చుని గొంతు నులిమిన బాలుడు

చనిపోయిందో లేదో అని ఆ తర్వాత గొంతు కోసి కింద పడిపోయిన సహస్ర కడుపులో 18 పోట్లు పొడిచిన బాలుడు

దొంగతనానికి వచ్చే ముందు దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చేయాలో పక్క ప్లాన్‌తో ఒక పేపర్‌పై రాసి పెట్టుకున్న బాలుడు

హౌ టూ ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ రాసుకున్న బాలుడు

పక్క బిల్డింగ్ నుంచి లోపలికి వచ్చినట్టు గుర్తించిన పోలీసులు

సహస్ర ఇంట్లోంచి పక్క బిల్డింగ్‌లోకి వెళ్లిపోయిన బాలుడు.. పక్క బిల్డింగ్‌లో 15 నిమిషాల పాటు దాక్కునట్లు సమాచారం ఇచ్చిన సాప్ట్‌వేర్ ఉద్యోగి

సాప్ట్‌వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో బాలుడు చదువుకుంటున్న స్కూల్‌కి వెళ్లి విచారించిన పోలీసులు

నోరు విప్పకపోవడంతో బాలుడి ఇంట్లో తనిఖీలు చేయగా కత్తి, రక్తపు గుర్తులతో ఉన్న బట్టలు లభ్యమవడంతో అవి స్వాధీనం చేసుకొని బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు…

హైదరాబాద్ కూకట్‌పల్లిలో 12ఏళ్ల సహస్ర హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. దర్యాప్తులో భాగంగా పక్కింట్లో నివసిస్తున్న పదో తరగతి విద్యార్థి నిందితుడని తేలింది. దొంగతనం ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన అతడు.. బాలికను చూసి భయంతో హత్య చేసి నగదు దోచుకున్నట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం నిందితుడు అదుపులో ఉండగా.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవగా.. చిన్నారిని బలిగొన్నది ఒక విద్యార్థి కావడం మరింత కలకలాన్ని రేపింది…

దొంగతనం చేస్తుండగా బాలుడిని చూసి స‌హ‌స్ర కేక‌లు పెట్టింది. దీంతో దొరికిపోతాన‌ని భావించిన బాలుడు.. ఆమెపై కూర్చుని గొంతు నులిమి చంపేశాడు. చనిపోయిందో లేదో అని ఆ తర్వాత గొంతు కోసి కింద పడిపోయిన సహస్ర కడుపులో 18 క‌త్తిపోట్లు పొడిచాడు. అనంత‌రం ప‌క్క బిల్డింగ్ లోకి దూకి ప‌దిహేను నిమిషాల పాటు త‌ల దాచుకున్నాడు. అయితే బాలుడు పారిపోతుండ‌గా.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గ‌మ‌నించి, పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. దాంతో స‌హ‌స్ర హ‌త్య వెలుగు చూసింది. ప్ర‌స్తుతం బాలుడు కూక‌ట్‌ప‌ల్లి పోలీసులు అదుపులో ఉన్న‌ట్లు తెలుస్తుంది..దొంగతనానికి వచ్చే ముందు దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చేయాలో పక్క ప్లాన్‌తో ఒక పేపర్‌పై ప్ర‌ణాళిక‌ను రాసిపెట్టుకున్నాడు. హౌ టూ ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ రాసుకున్నాడు. ఈ పేప‌ర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా బాలుడు ప‌లు క‌ట్టుక‌థ‌లు చెప్పాడు. కానీ చివ‌ర‌కు నేరాన్ని అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. నోరు విప్పకపోవడంతో బాలుడి ఇంట్లో తనిఖీలు చేయగా కత్తి, రక్తపు గుర్తులతో ఉన్న బట్టలు లభ్యమవడంతో అవి స్వాధీనం చేసుకొని బాలుడిని అరెస్టు చేసి విచారించగా నిజాన్ని ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌ర్వ‌లోనే పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు పేర్కొన్నారు..

లెటర్ లో ఈ విధంగా రాశాడు..

గో టూ హోమ్..
రిమూవ్ ది లాక్
టేక్ ది మనీ
కీప్ ఇట్ గాడ్ దేర్
క్లోజ్ ది డోర్
కటింగ్ విత్ నైఫ్

బాలుడు దొంగతనం ఎలా చేయాలో వచ్చిరాని ఇంగ్లీష్‌లో రాసుకున్నాడు. హౌటు ఓపెన్‌ డోర్‌, హౌటు బ్రేక్ గాడ్‌ హుండీ, హౌటు ఎస్కేప్‌ హౌస్‌ అంటూ బాలుడు రాసుకున్నాడు. ఇదంతా గమనిస్తే.. బాలుడు ముందే దొంగతనం గురించి పకడ్బందీగా ఓ ప్లాన్ వేసుకున్నాడు. ఎప్పటి నుంచో ఆ ఇంట్లోకి దూరి చోరీకి పాల్పడాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా దొంగతనం కోసం ఎవరూ చూడకముందు సహస్ర ఇంట్లోకి దూరాడు. సహస్ర తల్లి దండ్రులు బయటకు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చాడు..