మెదక్‌ జిల్లాలో (Medak) భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు పర్యటన..!

మెదక్‌ జిల్లాలో (Medak) భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు (Harish Rao), దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి పర్యటిస్తున్నారు. ముంపు గ్రామాల్లో తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసానిస్తున్నారు..ముంపు గ్రామాల్లో తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసానిస్తున్నారు. ప్రజలను పరామర్శిస్తున్నారు. మరోవైపు వాతావరణాన్ని సాకుగా చూపి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తన కామారెడ్డి (Kamareddy)పర్యటనను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం సీఎం రేవంత్‌ రెడ్డి కామారెడ్డి జిల్లాలో ఏరియల్‌ సర్వే చేయాల్సి ఉన్నది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో తన పర్యటనను సీఎం వాయిదా వేసుకున్నారు. దీంతో తన నివాసం మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు..