27 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయిన ఏకైక వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్.. ఆయన సాధించిన అవార్డులు, రచించిన సాహిత్య రచనలివే!..
Sarvepalli Radhakrishnan.
సెప్టెంబర్ 5వ తేదీ మనమందరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామన్న సంగతి అందరికీ తెలిసిందే! ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన జీవితంలో కొన్ని విశేషాలు ఈ చేద్దాం..
సర్వేపల్లి గొప్ప పండితుడు. ఆయన 16 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి, నోబెల్ బహుమతికి 27 సార్లు నామినేట్ అయ్యారు. ఆయనకు 1954లో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ప్రాచీన కాలం నుంచి శ్రీకృష్ణుడిని గురువుగా, అర్జునుడిని శిష్యుడిగా పిలుస్తుంటాం. గురుశిష్యుల బంధానికి వారు కూడా ప్రతీకలు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు..
రాజ నీతి కోవిదుడు – విద్యావేత్త
డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా దేశసేవ చేసిన భారతరత్నం సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు.
బాల్యం – విద్యాభ్యాసం.
సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5వ తేదీన తమిళనాడులో తిరుత్తణి గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులు. రాధాకృష్ణన్ బాల్యమంతా తిరుత్తణి, తిరుపతిలోనే గడిచాయి. తండ్రి స్థానిక జమిందార్ వద్ద సబార్డినేట్ రెవెన్యూ అధికారిగా ఉండటంతో రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తణిలో కేవీ స్కూల్లో జరిగింది. 1896లో తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ ఎవాంజిలికల్ లూథరన్ మిషన్ స్కూలులోనూ, వాలాజీపేటలోని ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్లో జరిగింది.
స్కాలర్షిప్లతోనే చదువంతా!.
రాధాకృష్ణన్ చదువంతా స్కాలర్షిప్లతోనే జరిగిందంటే ఆయన ఎంతటి ప్రతిభావంతుడో అర్ధమవుతుంది. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండే రాధాకృష్ణన్ అంటే ఉపాధ్యాయులందరికీ ఎంతో ఇష్టముండేది.
వివాహం – సంతానం.
రాధాకృష్ణన్కు పదహారేళ్ల ప్రాయంలో తన దూరపు బంధువైన శివకాముతో వివాహం జరిగింది. రాధాకృష్ణన్కు ఒక కుమారుడితో పాటు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
పూజారి కాబోయి ఉపాధ్యాయుడిగా!.
రాధాకృష్ణన్ ఉన్నత చదువులకు వెళ్లడం వారి తండ్రి వీరాస్వామికి సుతరామూ ఇష్టముండేది కాదు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తన కుమారుడు ఏదైనా ఆలయంలో పూజారిగా స్థిరపడాలని ఆయన తండ్రి కోరుకునేవారట. అయితే తన కుమారుడు చదువులో చూపిస్తున్న అద్భుత ప్రతిభను చూసి అతనిని బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు…
అరిటాకులు కొనలేక.. నేల మీదే వడ్డించుకున్నారట!
రాధాకృష్ణన్ కడు పేదరికాన్ని అనుభవించారు. ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన తొలిరోజుల్లో అన్నం తినడానికి ఒక ప్లేటు కూడా కొనుక్కునే స్తోమత లేక అరిటాకులపై భోజనం చేసేవారని సమాచారం. ఒక్కోసారి అరిటాకులు కొనుక్కోవడానికి కూడా డబ్బులేకపోతే, నేల గచ్చుపై నీటితో శుభ్రం చేసుకుని ఆ నేలపైనే అన్నం వడ్డించుకుని తినేవారట. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి తనకు వచ్చిన పతకాలను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి…
సర్వేపల్లి రాధా కృష్ణన్ సాహిత్య రచనలు
ముఖ్యమైన ఉపనిషత్తులు, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్-రిఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫేత్, ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫి, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ లాంటి అనేక గొప్ప గ్రంథాలు సర్వేపల్లి రచించారు.
రాధాకృష్ణన్ రచించిన మొదటి పుస్తకం 1918 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తత్వశాస్త్రం.
అతని రెండవ పుస్తకం 1923లో ఇండియన్ ఫిలాసఫీ పేరుతో ప్రచురించబడింది.
1926లో ప్రచురించబడిన ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనేది రాధా కృష్ణన్ యొక్క మూడో పుస్తకం, ఇది హిందూ తత్వశాస్త్రం, విశ్వాసాలకు సంబంధించినది.
యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ 1929లో ప్రచురించబడింది.
కల్కి లేదా నాగరికత భవిష్యత్తు 1929లో ప్రచురించబడింది.
1939 సంవత్సరంలో తూర్పు మతాలు, పాశ్చాత్య ఆలోచన పేరుతో తన ఆరో పుస్తకాన్ని ప్రచురించారు.
మతం మరియు సమాజం ఏడో పుస్తకంగా 1947లో ప్రచురించబడింది.
1948లో భగవద్గీత: పరిచయ వ్యాసం, సంస్కృత గ్రంథం, ఆంగ్ల అనువాదం, నోట్స్ ప్రచురించబడ్డాయి.
1950లో అతని దమ్మపద పుస్తకం ప్రచురించబడింది.
అతని పదో పుస్తకం ప్రధాన ఉపనిషత్తులు 1953లో ప్రచురించబడ్డాయి.
రికవరీ ఆఫ్ ఫెయిత్ 1956లో ప్రచురించబడింది.
1957లో ప్రచురించబడిన ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ.
బ్రహ్మ సూత్రం: ఆధ్యాత్మిక జీవితం యొక్క తత్వశాస్త్రం. 1959లో ప్రచురించబడింది.
మతం, సైన్స్ అండ్ సంస్కృతి పేరుతో అతని చివరి పుస్తకం 1968లో ప్రచురించబడింది…