విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవు13 రోజులు..!

తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ సారి దసరా సెలవులు 13 రోజులు ఉండనున్నాయి. పాఠశాల విద్యాశాఖ అన్ని పాఠశాలలకు సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 3 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది…అక్టోబర్‌ 4న స్కూళ్లు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ షెడ్యూల్ను అకడమిక్ క్యాలెండర్లో అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవులకు ముందు పాఠశాలలు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ) – 2 పరీక్షలు పూర్తి చేయాలి. (Dasara Holidays).
సెలవుల అనంతరం విద్యార్థులు అక్టోబర్‌ 24 నుంచి 31 వరకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ) – 1 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పరీక్షా పత్రాల మూల్యాంకనం అనంతరం ఎస్‌ఏ – 1 ఫలితాలు నవంబర్‌ 6న ప్రకటిస్తారు.

ఎస్‌ఏ – 1 పూర్తైన తర్వాత నవంబర్‌ నెలలో బోధన తప్పించి పరీక్షలు ఉండవు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 5 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి