అట్టహాసంగా ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర..!

గణేశుడి నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది. 303 కిలోమీటర్ల మేర కొనసాగనున్న శోభాయాత్రలు, నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జీహెచ్‌ఎంసీ 13 కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి 15 వేల మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. 30 వేల మంది పోలీసులు నిమజ్జన ఘట్టంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 160 యాక్షన్‌ టీంలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనులు, 134 క్రేన్లు, 259 మొబైల్‌ క్రేన్లు అధికారులు అందుబాటులో ఉంచారు. హైడ్రా, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్‌ సాగర్‌లో 9 బోట్లు సిద్ధం చేయగా, 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది..

ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర అశేష భక్తజనం మధ్య అట్టహాసంగా సాగింది. రాజ్‌ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా మహాగణపతి ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో నిమజ్జనం ప్రక్రియ పూర్తయింది. గణపతి బొప్పా మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మార్మోగాయి. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర, నిమజ్జనంకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా …

గణేష్ నిమజ్జనంలో సీఎం రేవం.

గణేష్‌ నిమజ్జనం అంటే.. వెంటనే గుర్తుకు వచ్చేది హైదరాబాద్‌.. గణపయ్యలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు.. గణపయ్యలకు బైబై చెబుతూ.. గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.. గత రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని చెరువులతో పాటు.. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కొనసాగుతుండగా.. ఈ రోజు కీలక నిమజ్జనం జరగనుంది.. అటు బాలాపూర్‌ గణపతి.. ఇటు ఖైరతాబాద్‌ బడా గణేష్‌.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా.. ఇక, నగరం నలువైపుల నుంచి సాగరం వైపు కదుతున్నారు గణనాథులు…

ఉద‌యం 10 : రాజ్‌దూత్ స‌ర్కిల్‌కు చేరిన శోభాయాత్ర
ఉద‌యం 10.45 : టెలిఫోన్ భ‌వ‌న్‌కు చేరిన మ‌హా గ‌ణ‌ప‌తి
ఉద‌యం 11 : తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద క‌న్నుల పండువ‌గా సాగిన శోభాయాత్ర‌
ఉద‌యం 11.20 : తెలంగాణ స‌చివాల‌యం ముందుకు చేరిన గ‌ణ‌నాథుడు
ఉద‌యం 11.40 : ఎన్టీఆర్ గార్డెన్స్ వ‌ద్ద‌కు చేరిన శోభాయాత్ర‌
ఉద‌యం 11.45 : బాహుబ‌లి క్రేన్ వ‌ద్ద‌కు చేరిన గ‌ణ‌నాథుడు
మ‌ధ్యాహ్నం 12.05 : మ‌హా గ‌ణ‌ప‌తికి మ‌హా హార‌తి
మ‌ధ్యాహ్నం 1.30 : హుస్సేన్ సాగ‌ర్‌లో గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌నం
మ‌ధ్యాహ్నం 1.45 : మ‌హా గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం ముగింపు..

ఖైరతాబాద్ గణనాథుడు (Khairatabad Ganesh) గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. లక్షలాది భక్తుల మధ్య మహా గణపతి ట్యాంక్‌బండ్‌లో నిజమజ్జనమయ్యాడు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన బడా గణేశ్ శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. దారిపొడవున ఎక్కడ చూసినా గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా వారి భక్తిని చాటుకున్నారు. అడుగడుగున మహాగణపతికి నీరాజనం పలికారు. మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి..
విజయవాడ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన వాహనంలో 70 టన్నుల భారీ గణనాథుడి శోభాయాత్ర నిర్వహించారు. భక్తుల కోలాహలం నడుమ ఎన్టీఆర్‌ మార్గ్‌లోని నాలుగో క్రేన్‌ వద్దకు చేరిన లంబోధరుడికి.. ఖైరతాబాద్‌ ఉత్సవసమితి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ క్రేన్‌ సహాయంతో హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేశారు..

అమిత్ షా కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భాగ్యనగర్ ఉత్సవ సమితి స్టేజి పైకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి..!

స్టేజి పైన ఉన్న బీజేపీ నాయకులతో కలిసి గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి..!