తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్…

హైదరాబాద్: తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యింది. 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ ఎత్తివేస్తూ.. గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు ఆమోదముద్ర వేశారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలకు కూడా అనుమతి ఇస్తూ.. ప్రకటన విడుదల చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌‌ విడుదలయ్యే అవకాశం ఉంది..

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లకు ఆమోదముద్ర వేశారు. దీంతో బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మార్గం సుగమం అయింది. దీంతోపాటు పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయా చట్టాల్లో సవరణలు చేసింది. ఆ సవరణలకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో వీటిపై గెజిట్ జారీ చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి రూట్ క్లియర్ కావడంతో స్థానిక ఎన్నికలకు కూడా మార్గం సుగమం అయింది..