పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం.

పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లు సౌదీ అరేబియాలో పర్యటించారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య బిగ్గెస్ట్ డిఫెన్స్ డీల్ కుదిరింది..ఈ మేరకు సౌదీ ప్రిన్స్ మాట్లాడుతూ.. పాకిస్థాన్, సౌదీలో ఏ దేశంపైన దాడి జరిగినా అది ఇరు దేశాల మీద జరిగినట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు.

ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ బంధం మరింత దృఢంగా మారినట్లు చెప్పవచ్చు. అయితే ఈ రక్షణ ఒప్పందంపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య మధ్య ఒప్పందంతో భారత్ పై పడే ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది..సౌదీ రాజధాని రియాద్ లోని యమనా ప్యాలెస్ లో ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య సైనిక విన్యాసాలు జరగనున్నాయి. అడ్వాన్స్ డ్ డిఫెన్స్ టెక్నాలజీని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకోనున్నాయి. అలాగే ఇంటెలిజెన్స్ విభాగాన్ని కూడా షేరింగ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం బయటి దేశాలకు ఓ దృఢమైన సందేశం అని పాకిస్థాన్ పేర్కొంది.

అయితే ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు భారత్ పై పడే ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తామని వెల్లడించింది. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ కీలక ప్రకటన చేశారు. సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య రక్షణ ఒప్పందం.. ఈ పరిణామంపై భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ఇరు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జాతీయ భద్రత, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను గమనిస్తున్నట్లు రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. భారత జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు…మరోవైపు ఇజ్రాయెల్ గత వారం హమాస్ రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని దోహాలో దాడి చేసింది. ఈ దాడిలో ఆరుగురు మరణించారు. అందులో ఖతార్ భద్రతా దళాల సభ్యుడూ ఉన్నారు. ఖతార్ ఈ దాడిని ఉగ్రవాదం అని తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం, ఈ దాడి పూర్తిగా స్వతంత్ర నిర్ణయమని, హమాస్ ఉగ్రవాద నాయకులనే లక్ష్యం చేసుకుని చేసినట్లు చెప్పింది…