చంద్రబాబుకు షర్మిల శాపనార్థాలు
కూటమి ప్రభుత్వం ఉల్లి రైతులను నిండా ముంచేసిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రైతుల ఇంట కన్నీళ్ళు పెట్టించిన పాపం సీఎం చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ‘ఉల్లి ఎండినా నష్టమే.. ఇప్పుడు పండినా నష్టమే. ఎకరాకు రూ.1.20లక్షల పెట్టుబడి పోసి పండిస్తే.. మీరిచ్చే ధర కిలోకి 50 పైసలా? ఆరుగాలం కష్టించి పండిస్తే రైతుకి దక్కిన ఆదాయం ఎకరాకు రూ.3వేలు మాత్రమేనా.’ అంటూ నిలదీశారు..
అమెరికా న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి.మర్ఫీ ఢిల్లీలో CM రేవంత్ సమావేశం.
ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి తో అమెరికా న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి.మర్ఫీ ఢిల్లీలో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరిపారు.
విద్య, గ్రీన్ ఎనర్జీ, వినోద పరిశ్రమ (ప్రత్యేకంగా సినిమా రంగం), మౌలిక సదుపాయాల అభివృద్ధి (మెట్రో, పట్టణ రవాణా) మరియు మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలు చర్చలో ప్రస్తావనకు వచ్చాయి.
‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి గారు వివరించారు. ఐటీ, ఫార్మా రంగాలు సహా రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక ప్రాధాన్యతలను పేర్కొన్నారు.
ఈ సమావేశంలో న్యూజెర్సీ ప్రథమ మహిళ శ్రీమతి టామీ మర్ఫీ తో పాటు న్యూజెర్సీ రాష్ట్ర ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు..
*🔹తెలంగాణలో మరో 19 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు.*
_• రిజిస్టర్డ్ పార్టీగా నమోదు చేసుకుని ఏ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో నిర్ణయం._
_• పోటీ చేసినా తగినన్ని ఓట్లు సాధించకపోవడం, సరైన పత్రాలు ఈసీకి సమర్పించకపోవడం వంటి కారణాలతో రద్దు.
*🔹ఈనెల 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేం* *సీఎం రేవంత్*
_• సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు._
_• ఎప్పుడు నిర్వహించాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు._
_• ఈనెల 30లోపు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు._
_• ప్రస్తుత పరిస్థితులను HCకి వివరించి, ఏం చేయాలో కోరుతామన్నారు..
తెలంగాణ రాష్ట్రం నుంచి సీబీఐకి మరో కేసు!
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
ఈ కేసుపై ఇప్పటికే విచారణ చేపట్టి కీలక ఆధారాలు సేకరించిన సిట్
కేసుకు సంబంధించి పలువురిని విచారించిన సిట్
ఇప్పటికే కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం
తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సెంట్రల్ ఏజెన్సీ సీబీఐకి అప్పగించే ఆలోచనలో తెలంగాణ సర్కార్..
హైదరాబాద్‌కు గోదావరి నీరు.. రూ.2,085 కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న రాంకీ..!!
హైదరాబాద్: దేశంలో ప్రముఖ ఇన్ఫ్రా సంస్థలలో ఒకటైన రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) నుండి రూ.2,085 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది.
ఈ ఒప్పందం గోదావరి తాగునీటి సరఫరా పథకం – ఫేజ్ II & ఫేజ్ IIIకి సంబంధించినది. ఇందులో భాగంగా మూసీ నది పునరుజ్జీవనానికి సహాయపడటానికి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లను గోదావరి నీటితో నింపనున్నారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) కింద రాంకీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ అయిన మల్లన్నసాగర్ వాటర్ సప్లై లిమిటెడ్ ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండేళ్లలో నిర్మాణాన్ని చేపడుతుంది. పూర్తయిన తరువాత 10 సంవత్సరాల పాటు నిర్వహణను చూసుకుంటుంది.
“ఈ ప్రాజెక్ట్ పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా స్థిరమైన నీటి మౌలిక సదుపాయాలను నిర్మించాలనే మా నిబద్ధతను బలోపేతం చేస్తుంది. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీతో భాగస్వామ్యం కావడం మాకు గర్వంగా ఉంది” అని రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యంచర్ల రత్నాకర నాగరాజా పేర్కొన్నారు..