భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్లో తమ స్థావరం ధ్వంసమైందంటూ ఇటీవల జేషే కమాండర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇది చర్చలో ఉండగానే.. తాజాగా లష్కరే తాయిబా అలాంటి ప్రకటనే చేసింది. ముర్దిక్లో తమ స్థావరం భారత దాడుల్లో నాశనమైందంటూ ఎల్ఈటీ కమాండర్ ఖాసిమ్ అంగీకరించాడు. ఈ మేరకు ఓ వీడియో సైతం అతను పోస్ట్ చేశాడు.
ఇది మళ్లీ నిర్మాణంలో ఉంది. అల్లా కృపతో ఇది ముందుకన్నా పెద్దదిగా నిర్మించబడుతుంది. ఈ శిబిరంలో ముజాహిదీన్, తాలిబులు (students) శిక్షణ పొందారని కూడా వెల్లడించాడు. అయితే.. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ భవనం ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించడంలేదని చెబుతున్నప్పటికీ.. LeT డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ మరో వీడియోలో పాక్ ప్రభుత్వం, ఆర్మీ ఈ కేంద్రాన్ని పునర్నిర్మించేందుకు నిధులు అందించాయని చెప్పడం కొసమెరుపు. దీంతో.. తమ భూభాగంలో ఉగ్ర స్థావరాలే లేవంటూ అసత్యాలు వల్లెవేస్తోన్న పాక్ ముసుగు తొలగిందని, ఉగ్ర సంస్థల బహిరంగ ప్రకటన చెంపపెట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు..
https://x.com/OsintTV/status/1968865125567226361?t=KLe_8Vv1yEgLg3kYhfiVnQ&s=19