వైసీపీ ఎలాగూ అసెంబ్లీకి రావడం లేదు. కూటమి పార్టీలే అపోజిషన్. కూటమి పార్టీలే అధికార పక్షం అన్నట్లు నడుస్తోంది ఏపీ అసెంబ్లీ. అందుకు తగ్గట్లుగానే తమ సభ్యులతో సమస్యలను ప్రస్తావించి..వాటికి మంత్రులతో సమాధానం చెప్పిస్తోంది కూటమి సర్కార్. అయితే ఓ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నే కాస్త హాట్ టాపిక్ అయింది. ఆయన అనుకున్నదొకటి అయితే..అయింది ఇక్కోటి అన్నట్లుగా మారిపోయిందట..అధికార పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమా..ఆల్ ఆఫ్ సడెన్గా ఏపీ అసెంబ్లీలో అపోజిషన్ ఎమ్మెల్యే రోల్ ప్లే చేసినట్లు కనిపించారు. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ను కార్నర్ చేస్తూ..పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో బొండా ఉమా వ్యాఖ్యలు, ఆరోపణలు కలకలం రేపాయి. దీంతో అసలు బొండా ఉమా అలా ఎందుకు మాట్లాడారు?
ఈ కేసు దీని నేపథ్యం ఏంటనే దానిపై అటు పవన్ ఆఫీస్, ఇటు సీఎంఓ కూడా ఆరా తీసిందట. అయితే ఏపీ అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్షపాత్ర పోషిస్తూ..ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుండటం చూస్తూనే ఉన్నామ్. ఇంత వరకు బానే ఉంది. కానీ సొంత సర్కార్ను ఇబ్బంది పెట్టడంతో పాటు తానే సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి ఆ ఎమ్మెల్యే వెళ్లిపోయారన్న టాక్ వినిపిస్తోంది.