బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు….

బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు..

• పేపర్‌లో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా పిటిషన వేస్తారన్న హైకోర్టు..

• స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు కేటాయించడం సరికాదని పిటిషన్‌.

బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పేపర్‎లో వచ్చిన క్లిప్పింగ్‎ల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్‎పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో రిట్ ​పిటిషన్​ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‏పై బుధవారం (సెప్టెంబర్ 24) విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్‎పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఏ అంశాల ఆధారంగా పిటిషన్ వేశారని పిటిషనర్‎ను నిలదీసిన హైకోర్టు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం మీకు ఏదైనా కాపీ ఇచ్చిందా అని ప్రశ్నించింది. వార్త పత్రికల్లో వచ్చినా కథనాల ఆధారంగా ఎలా పిటిషన్ వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్ట్ గైడ్‎లైన్స్ ప్రకారం పేపర్ క్లిప్పింగ్స్‎ను బేస్ చేసుకుని పిటిషన్ వేయడం సరికాదని పిటిషనర్‎కు చురకలంటించింది…