తొలి 10 ర్యాంకుల్లో ఆరుగురు మహిళలు..
టాప్-100లో ఐదుగురు తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ.
గ్రూప్-1 తుది ఫలితాలను(Group 1 Results) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) బుధవారం రాత్రి 12 గంటల తరువాత విడుదల చేసింది. మొత్తం 563కుగాను 562 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణుల జాబితాను తమ వెబ్సైట్లో ప్రచురించింది. తుది ఎంపికలో మల్టీజోన్-1లో 258, మల్టీజోన్-2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. న్యాయవివాదం నేపథ్యంలో మరొక పోస్టును విత్హెల్డ్లో పెట్టింది. ఈ ఫలితాలు హైకోర్టులో విచారణలో కేసులపై వెలువడే తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది…
ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకాలు ఏ క్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. తుది ఎంపికలో మల్టీజోన్-1లో 258, మల్టీజోన్-2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది.
అభ్యర్థులు, ర్యాంకులు : గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు 550 మార్కులతో మల్టీజోన్-2 కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్రావు నగర్కు చెందిన లక్ష్మీదీపిక రాష్ట్ర టాపర్గా నిలిచారు. ఉస్మానియాలో వైద్య విద్య పూర్తిచేసిన ఆమె, గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపించారు. మల్టీజోన్-1 కేటగిరీలో టాపర్గా నిలిచిన హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్విని రాత పరీక్షల్లో 532 మార్కులు సాధించారు. ప్రస్తుతం ఆమె మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారు. గ్రూప్-1లో టాప్-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీవో పోస్టులు ఎంపిక చేసుకున్నారని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పారు. టాప్-10 ర్యాంకులను వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి సాధించారన్నారు..
తొలి 10 ర్యాంకుల్లో ఆరుగురు మహిళలు..
టాప్-100లో ఐదుగురు తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ
జనరల్ మెరిట్ ర్యాంకు జాబితాలో తొలి 10 ర్యాంకుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. టాప్-50 ర్యాంకుల్లో 25 మంది మహిళలు, వంద ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉన్నారు. గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో 500పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 52 మంది ఉన్నారు. టాప్-3 ర్యాంకర్తో పాటు టాప్-100లో ఐదుగురు తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ చాటారు. గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకు జాబితా-జీఆర్ఎల్ ప్రకటించింది..