శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డును అభిషేక్ శర్మ బద్దలు.
ఆసియా కప్ భారత్ మరోసారి సత్తా చాటుతూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్ ఫోర్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట అభిషేక్ శర్మ (75: 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరోసారి అదిరే ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా జట్టులో ఓపెనర్ సైఫ్ హసన్ (69: 51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేయగా, పర్వేజ్ ఇమాన్ (21) ఫర్వాలేదనపించాడు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో బంగ్లా మూడు బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్ అయ్యింది. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ 3, బుమ్రా 2, వరుణ్ 2, అక్షర్, తిలక్ వర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. గురువారం పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్టు ఆదివారం (సెప్టెంబరు 28) ఫైనల్లో భారత్‌తో ఆడనుంది. కాగా, శుక్రవారం భారత్, లంక మధ్య జరిగే మ్యాచ్ నామమాత్రమే కానుంది.
మరోసారి అదరగొట్టిన అభిషేక్ శర్మ
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (75; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరోసారి అదరగొట్టాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (29; 19 బంతుల్లో) కూడా రాణించాడు. గిల్, అభిషేక్ ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 72/0తో నిలిచి భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. శివమ్ దూబె (2), సూర్యకుమార్ యాదవ్ (5), తిలక్ వర్మ (5) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్య (38; 29 బంతుల్లో), అక్షర్ పటేల్ (10*) పరుగులు చేశారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుస్సేన్ 2, ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్, సైఫుద్దీన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
స్కోర్లు బోర్డు.
భారత్: 20 ఓవర్లలో 168/6(అభిషేక్ 75, హార్దిక్ 38, రిషాద్ 2/27, తంజిమ్ 1/27),
బంగ్లాదేశ్: 19.3 ఓవర్లలో 127 ఆలౌట్(సైఫ్ 69, పర్వేజ్ 21, కుల్దీప్ 3/18, బుమ్రా 2/18).