ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం..

*ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం*

– ఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా కొలువుదీరనున్న శ్రీ రాముడి విగ్రహం..

– ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు..

– ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేసిన విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు…

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో 600 అడుగుల ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ నిపుణుల బృందం ప్రతిపాదించింది. జాతీయ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, చెరువు మధ్యలో విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. రానున్న 30 ఏళ్లలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒంటిమిట్ట రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు టీటీడీకి నివేదిక సమర్పించారు.