స్పీకర్‌తో భేటీ అయిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!

స్పీకర్‌తో భేటీ అయిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు.

స్పీకర్‌తో కడియం, ఆరికెపూడి గాంధీ, ప్రకాష్‌గౌడ్‌, కాలె యాదయ్య భేటీ. సమావేశంలో పాల్గొన్న శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు.

_• వివరణ ఇచ్చేందుకు 30 వరకు గడువు కోరిన కడియం శ్రీహరి. అక్టోబర్‌ 6 నుంచి 23 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌._

ngana Assembly Speaker Gaddam Prasad Kumar)తో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌‌లు ఇవాళ (శుక్రవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కూడా పాల్గొన్నారు…అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ నోటీసులకు ఇప్పటికే కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌లు వివరణ ఇచ్చారు. అయితే, ఈ నెల 30వ తేదీ వరకూ కడియం శ్రీహరి గడువు కోరారు. ఈనెల 29 నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు విదేశీ పర్యటనకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెళ్లనున్నారు. విదేశీ పర్యటనకు ముందే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది..