నేరేడుచర్లలో డివైడర్ ని ఢీకొట్టిన కారు,, ఒకరు మృతి,ఇద్దరికి గాయాలు..!

సూర్యాపేట జిల్లా

నేరేడుచెర్ల మండలం

జగ్గయ్యపేట నుండి మిర్యాలగూడ వైపుగా వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్నీ డీ కొట్టిన కారు..

కారు లో ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం..

ఒకరు స్పాట్ డెడ్

ప్రమాదం లో కారు ఇంజన్ ఊడి 100 మీటర్స్ దూరం లో పడింది.

బ్రతుకుతెరువుకు వెళుతూ, అనంత లోకాలకు వెళ్లిన యువకుడు..

అతి వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీ కొట్టి పల్తి కొట్టిన సంఘటనలో ఒక యువకుడు మృతి చెందగా ఇద్దరు యువకులకు తీవ్ర గాయలైన సంఘటన, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4-30 సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన నిమ్మ తోట తనుష్ కుమార్ తో పాటు షేక్ బబ్లు హరి హుజూర్ నగర్ నుంచి మిర్యాలగూడ వైపు మార్గంలో మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో అతివేగంగా ప్రయాణం చేస్తూ నేరేడుచర్ల పట్టణంలోని హెచ్ పి బంక్ సమీపంలో గల డివైడర్ను ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నిమ్మతోట తనీష్ కుమార్ (25) మృతి చెందాడు. అలాగే షేక్ బబ్లు హరిలకు కూడా తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం తనీష్ మృతదేహం మిర్యాలగూడ లోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. అలాగే ఇద్దరు యువకులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే వీరు ఫంక్షన్లకు ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీరికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డ పోలీసులు… ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు..

ఘటనకు సంబంధించిన వీడియోలు cc పుటెజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..