ఎన్ఎస్యూఐ సమావేశం రసాభాస…రెండు వర్గాలుగా విడిపోయి రచ్చ రచ్చ…

గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ సమావేశం రసాభాసగా...

కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ సమావేశం రసాభాసగా మారింది. గాంధీభవన్ ఆవరణలోని ఇందిరా భవన్ లో నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి రచ్చ రచ్చ చేశారు. బెంచీలు, కుర్చీలు విసిరేసుకున్నారు. మూడేళ్లుగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించకపోవడంపై అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను కొందరు నిలదీశారు. దీంతో జిల్లా అధ్యక్షులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ చందనారెడ్డి మధ్య గొడవ మొదలైంది. యూనివర్సిటీల్లో ఎలాంటి కమిటీలు నియమించకుండా వెంకట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చందన ఆరోపించారు…