దసరా వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం, దేవరగట్టులో ప్రతి ఏడాది బన్ని ఉత్సవం (దేవరగట్టు కర్రల సమరం) నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర సమయంలో హింస చెలరేగి, రెండు వర్గాల వారు కర్రలతో తలపడ్డారు..
https://www.instagram.com/reel/DPTX7lAEedd/?igsh=MWJydmVldjkwbXV5aA==
దేవరగట్టు ఉత్సవంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు ప్రతి ఏడాది కర్రల సమరం ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఈ సమరంలో ఇద్దరు మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. మరో 5 మంది పరిస్థితి మరింత విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. వీరిని ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే 800 మంది పోలీసుల బందోబస్తు కూడా ఈ ప్రాంతంలో చేపట్టారు.. దసరా ఉత్సవంలో భాగంగా బన్నీ ఉత్సవంలో మాల మల్లేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. వాటిని దక్కించుకోవడానికి మూడు గ్రామాల భక్తులు ఒకవైపు.. ఏడు గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడుతూ ఉంటారు. ఈ సమరాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనం కూడా తరలివస్తారు. ఈ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా ప్రతి ఏటా బన్నీ ఉత్సవం దసరా సందర్భంగా నిర్వహిస్తారు. అర్ధరాత్రి 12 గంటలకు మాల మల్లేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులు ఊరేగిస్తారు. వాటిని దక్కించుకోవడానికి ఈ గ్రామాల వారు పోటీ పడతారు. అయితే అడుగడుగునా సీసీ కెమెరాలను కూడా ఈసారి అమర్చారు. 50 పడకల తాత్కాలిక వైద్య శిబిరాన్ని కూడా సిద్ధం చేసి, 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. .ఈ దేవర గట్టు బన్నీ ఉత్సవంలో భాగంగా ఉత్సవ మూర్తులను దగ్గించుకోవడానికి ఒకే చోట రెండు లక్షల మంది పాల్గొన్నట్లు సమాచారం. అందుకే ఈ కర్రల సమరంలో ఇద్దరు మృతి చెందగా.. వంద మందికి పైగా గాయాల పాయలు అయ్యారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు గట్టుపైకి చేరుకున్నారు. అర్ధరాత్రి తర్వాత మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. ఆ తర్వాత ఉత్సవ మూర్తుల కోసం కర్రల కొట్లాట ప్రారంభమైంది. చాలామందికి తలలు పగిలి తీవ్ర గాయాలకు గురికావడంతో వైద్య శిబిరంలోని చికిత్స అందించారు. పరిస్థితి కొంతమందిని మరింత విషమంగా ఉన్నట్లు సమాచారం వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...
Prev Post