…
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 103మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 49 మందిపై కలిపి రూ.1 కోటి వరకు రివార్డు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో 22 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్టు భావజాలంపై అసంతృప్తి, అంతర్గత కలహాలే కారణమని ఎస్పీ జితేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఒక్కరోజులో ఇంత పెద్ద ఎత్తున లొంగిపోవడం ఇదే మొదటిసారి. లొంగిపోయిన వారికి ప్రభుత్వం రూ.50వేలు చొప్పున సాయం అందించింది.