మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పాల చెట్టు వద్ద దసరా రోజు ఇరువర్గాల మధ్య ఒకరిపై ఒకరి దాడి..

https://www.facebook.com/share/19rZSTG496/

తెలంగాణ రాష్ట్రంలో, యువత ఎక్కువగా మధ్యానికి గద్యానికి అలవాటు పడి రోడ్డు మీద వీరంగం సృష్టిస్తున్నారు… పోలీసులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది….
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పాల చెట్టు వద్ద దసరా రోజు ఇరు వర్గాల మధ్య ఒకరిపై ఒకరి దాడి చూసే వారికే భయానక పరిస్థితి ఎదురైంది.. ఈ దాడిలో పలువురు గాయపడగా మరికొందరికి తీవ్రమైన గాయాలు తగిలాయి…
భయభ్రాంతులకు గురయ్యామని స్థానికుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాడి జరుగుతున్న సమయంలో భయంతో వాహన దారులు రోడ్డుపై ఇరువైపులా నిలిచిపోవడం విశేషం… సుమారు అంతసేపు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న పోలీసుల రాకపోవడం కూడా కొంత వారి అలసత్వాన్ని చూపిస్తుంది… రక్తాలు కారేలా కొట్టుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..