రిజర్వేషన్స్ పై నేడే కీలక తీర్పు..ఆశావహుల్లో ఉత్కంఠ..!

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన కోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో సూర్యాపేట జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 23 జడ్పీటీసీ, 23 ఎంపీపీ పదవుల భవితవ్యాన్ని, అలాగే 235 ఎంపీటీసీ స్థానాలు, 486 గ్రామ సర్పంచుల స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.