రన్ వే నుంచి ఓ విమానం జారి సముద్రంలోకి…

వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్నాయి. విమాన ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా హాంకాంగ్ లో మరో విమాన ప్రమాదం జరిగింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే నుంచి ఓ విమానం జారి సముద్రంలో పడిపోయింది. ఫ్లైట్ అదుపుతప్పి జారిపోయే సమయంలో గ్రౌండ్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. ప్రమాదానికి కారణం అయిన కార్గో విమానం దుబాయ్ నుంచి వచ్చింది..

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?.

టర్కిష్ క్యారియర్ ఎయిర్ ACT నడుపుతున్న ఎమిరేట్స్ స్కైకార్గో విమానం EK9788 దుబాయ్‌ లోని అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (DWC) నుండి బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున ఈ విమానం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. విమానాశ్రయంలోని నార్త్ రన్‌వే 07R మీద దిగాల్సి ఉంది. అయితే, ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పినట్లు అధికారులు వెల్లడించారు. ల్యాండింగ్ రోల్ సమయంలో ఎడమ వైపుకు తిరిగి, రన్‌ వే పక్కన ఉన్న సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విమానం కొంత మేర నీళ్లలో మునిగిపోయింది..