నిజామాబాద్ జిల్లా:
రౌడీ షీటర్, దొంగ రియాజ్ ఎన్కౌంటర్
నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు
ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నిందితుడు రియాజ్ పోలీస్ ఎన్కౌంటర్ లో మృతి
నిన్న రియాజ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఓ యువకుడితో ఘర్షణలో రియాజ్కు గాయాలు
జీజీహెచ్లో చికిత్సపొందుతూ మృతిచెందిన రియాజ్
నిజామాబాద్ ఆస్పత్రిలో పోలీసుల కాల్పులు
పోలీసుల కాల్పుల్లో నిందితుడు రియాజ్ మృతి...
నిజామాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నరౌడీ షీటర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కానిస్టేబుల్ ప్రమోద్ చావుకు కారణమైన రియాజ్ను నిజామాబాద్ పోలీసులు ఆదివారం గాయాలతో అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడితో ఘర్షణలో రియాజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
గాయాలతో అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడితో ఘర్షణలో రియాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసి.. హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. బీబీహెచ్లో చికిత్స పొందుతూ తప్పించుకోడానికి ప్రయత్నించాడు. నిన్న రౌడీ షీటర్ రియాజ్ పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సీపీ స్పందించి రియాజ్ చనిపోలేదని ప్రకటించారు. మరో వ్యక్తితో జరిగిన ఘర్షణలో రియాజ్ తీవ్రంగా గాయపడ్డాడని ఆయన తెలిపారు. చికిత్స నిమిత్తం రౌడీ షీటర్ రియాజ్ను హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో సోమవారం ఉదయం పోలీసుల నుంచి అతడు తప్పించుకోడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు అతనిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాపాలాగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఫైరింగ్ చేయబోయాడు రియాజ్..