రాజగోపాల్ రెడ్డి కండిషన్స్..ఒక్కో నియోజవర్గానికి ఒక్కో రూల్ ఉండదు,వ్యాఖ్యలు చేసిన జూపల్లి కృష్ణారావు..!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Vs మంత్రి జూపల్లి కృష్ణారావు..
మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై కొత్త నిబంధనలు పెట్టిన రాజగోపాల్ రెడ్డి..
సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండాలని, పర్మిట్ రూంలు ఉండొద్దని రాజగోపాల్ రెడ్డి కండిషన్స్..
దీంతో టెండర్లు వేయడానికి భయపడి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వద్దకు వెళ్ళిన మద్యం వ్యాపారులు..
ఈ విషయంపై స్పందిస్తూ, రాష్ట్రమంతా ఒకటే రూల్ ఉంటుంది, ఒక్కో నియోజవర్గానికి ఒక్కో రూల్ ఉండదు, అందరూ ఫాలో అవ్వాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేసిన జూపల్లి కృష్ణారావు..
మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై, ప్రభుత్వం అధిష్టానానికి పూర్తి నివేదిక పంపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చలు..
గతంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలోని కొత్త వైన్ షాపులకు టెండర్లు వేసేవారికి రూల్స్ పెట్టారు. అవి తప్పనిసరిగా పాటించాల్సిందేనని చెప్పారు. అంతేకాకుండా.. టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు..తాను పెడుతున్న షరతులు మద్యం షాపులకు టెండర్లు వేసేవారిని ఇబ్బంది పెట్టడానికి కాదని.. తన నియోజకవర్గం ప్రజల ఆరోగ్యం బాగుపడితే వారి జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని, ఇంట్లో యాజమాని తాగకుండా ఉంటే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధిస్తారని అందుకే ఇటువంటి సూచనలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను మద్యానికి వ్యతిరేకం కాదని, ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిమీద తాగుతూ తాగుడుకు బానిసలుగా మారుతున్న విధానానికి మాత్రం వ్యతిరేకమని చెప్పారు..