*ఖమ్మం: ఆ మండలాలకు కేంద్రం రూ.కోటి నజరానా*
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా అధిక సోలార్ ప్లాంట్లు కలిగిన గ్రామాలను మోడల్ గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఖమ్మం నుంచి 8, భద్రాద్రి జిల్లా నుంచి 14 గ్రామాలు అర్హత సాధించాయి. చివరికి ఉమ్మడి ఖమ్మం నుంచి కొనిజర్ల, భద్రాచలం అధిక మొత్తంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తితో ముందు భాగాన నిలిచాయి. దీంతో ఆ రెండు మండలాలకు కోటి చొప్పున నజరానాను కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది.