కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్..

హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న ప్రైవేటు బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.. సీఎం రేవంత్..

_• ప్రమాదంలో పలువురు మృతి చెందారన్న వార్త తీవ్రంగా కలచివేసింది. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను._

_• ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి, సహాయక చర్యలను సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించాను._

_• క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం, ఇతర సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన అందించాలని అధికార్లను ఆదేశించాను._

_• తక్షణం ఘటన స్థలానికి వెళ్లి, సహాయక చర్యలను పర్యవేక్షించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించాను._

కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్‌ చెందిన వోల్వో బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం ఉలిందకొండ సమీపంలోకి రాగానే ట్రావెల్ బస్సు.. బైక్‌ని ఢీ కొట్టింది. టూ వీలర్‌ని దాదాపు 300 మీటర్ల వరకు ఈడ్చుకుపోయింది బస్సు. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. బస్సు కింద బైక్ ఉండిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు అంతా అంటుకున్నాయి. ఘటన తెల్లవారుజామున జరగడంతో ప్రయాణికులు అంతా గాఢ నిద్రలో ఉన్నారు. బైక్ పైనున్న వ్యక్తి కూడా స్పాట్‌లో మరణించాడు..