కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

*🔹ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

* కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20మందికిపైగా సజీవ దహనం కావడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

* మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

* మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మోదీ వెల్లడించారు.

* క్షతగాత్రులు తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు..

కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరులో బైకును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 20 మంది చనిపోయినట్లు సమాచారం. ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది..అయితే, బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు..