యువతకు ఉద్యోగ, ఉపాధి చూపించడమే లక్ష్యం… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట జిల్లా.. హుజూర్ నగర్ లో ప్రారంభమైన మెగా జాబ్ మేళా, భారీగా హాజరైన నిరుద్యోగులు,, జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్, జిల్లా ఎస్పీ నరసింహ…

అనంతరం మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ…

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అన్ని అన్నారు.. మెగా జాబ్ మేళాను రెండురోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తో నేడు మొదటి రోజు. విద్యార్థులు వారిగా హాజరయ్యారని అన్నారు… కొన్ని కంపెనీలను బ్రతిమిలాడి, ఒప్పించి హుజూర్నగర్ నియోజకవర్గానికి తెప్పించడం జరిగింది అన్నారు .. ఇప్పటివరకు 30 వేలకు పైగానే నిరుద్యోగులు పేర్లు నమోదు నేరుగా ప్రత్యక్షంగా సర్టిఫికెట్లతో మరికొందరు పాల్గొనడం జరిగిందని అన్నారు … విద్యార్థులు అత్యధిక సంఖ్యలో నమోదు కావడంతో ఒక్కరోజులో ఇబ్బంది అవుతుందని రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.. ఒక విధంగా చెప్పాలంటే యువతీ యువకులకు ఊహించని శుభవార్త అని అన్నారు… నేటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి హుజూర్‌నగర్‌ ప్రాంతంలో మెగా జాబ్ మేళా కు ప్రభుత్వం పూర్తి బాధ్యత తో నిర్వహించడం జరిగింది అని… ఈ జాబ్ మేళా రెండో రోజు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. . ఇప్పటికే వేలాది సంఖ్యలో నిరుద్యోగులు జాబ్ మేళాలో పేర్లు నమోదు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపేరు..ఈ జాబ్ మేళాలో దాదాపు 255 పై చిలుకు పరిశ్రమల వివరాలను కేటగిరీ వారిగా విభజించారు…. పూర్తి వివరాలను ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శన చేశారు. అలాగే నిరుద్యోగుల సంఖ్యకు అనుగుణంగా అల్పాహారం, భోజనం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది… నిరుద్యోగుల కోసం ప్రతీ ఆర్టీసీ బస్ ఆ ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు…. వందల సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూ నిర్వహించి వారికి నియామక పత్రాలు కూడా అందించడం జరిగిందని అన్నారు…

భారీ స్థాయిలో విద్యార్థుల ఆసక్తి..

కాలేజీల నుండి కూడా ఫైన ఇయర్ స్టూడెంట్స్ భారీగా తరలి రావడం జరిగింది.. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ వారు కూడా నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో నిర్వహించారు..

అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాలు..

అన్ని శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని జయప్రదం అయ్యేలా చేశారు…