గ్రామీణ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్ మేళా… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి….

*సూర్యాపేట జిల్లా*

హుజూర్ నగర్

మంత్రి ఉత్తం నివాసంలో మీడియా సమావేశం…

*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..*

నేడు జరిగిన జాబ్ మేళా విజయవంతం కావడం ఎంతో సంతోషంగా ఉన్నది..

రేపు జరగాల్సిన జాబ్ మేళా కొన్ని కారణాల వల్ల రద్దు చేయడం జరిగింది… తదుపరి తేదీ ఎప్పుడూ అనేది త్వరలోనే వెల్లడిస్తాం అన్నారు…

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా మెగా జాబ్ మేళా జరిగింది.

ఈ మెగా జాబ్ మేళలో

259 కంపెనీలు పాల్గొన్నాయి..

20463మంది యువత పాల్గొన్నారు.

3041 మందికి జాయినింగ్ లెటర్ఇవ్వడం జరిగింది, మరో 1533 మందికి కంపెనీ వాళ్ళు ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది…

మరొక రోజు జాబ్ మేళా నిర్వహించడానికి మొదట అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల రేపటి జాబ్ మేళాను మరొక రోజుకు వాయిదా వేయడం జరిగింది..

త్వరలో మళ్ళీ జాబ్ మేళా నిర్వహిస్తాం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంపెనీ వాళ్లకు మరియు పోలీసు వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు.

గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వెనుకబడిన కులాల వారికి సరైన ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు…

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు మా పార్టీకి నిరంతర ప్రక్రియగా జరుగుతుంది.

రాష్ట్రంలో దేశంలో ఎక్కడైన ఉద్యోగాలు చేయగలిగే శక్తి ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాము…

Sc, st, bc మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాల నిరుద్యోగులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగ పరుచుకోవాలి….

ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లే కాకుండా, ప్రైవేటు రంగంలో కూడా అత్యధిక పారితోషకంతో ఉద్యోగ నియమాకాలు జరుగుతున్నాయని అన్నారు… ఎంతో శ్రమించి చదివిన చదువుకి సరైన గుర్తింపు రావాలి అంటే అది ఉద్యోగం సాధించినప్పుడే దాని విలువ తెలుస్తుందని అన్నారు… నేడు జరిగిన జాబ్ మేళా తరహాలో రానున్న రోజుల్లో కూడా మరికొన్ని కంపెనీలను కలుపుకుంటూ భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన కంపెనీలకి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. ఈ మెగా జాబ్ మేళా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు… చాలామందికి ఇదొక ఎక్స్పీరియన్స్ గా కూడా మారుతుందని ప్రతి ఒక్క యువత కూడా అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు…

వాయిదాకు కారణం ఇదే..!?
వీకెండ్ కావడం ఒక కారణం.. భారీ స్థాయిలో నిరుద్యోగులు హాజర కావడం,. సాఫ్ట్వేర్ ఉద్యోగులకి దొరికేది ఒకే ఒక్క రోజు ఆ ఒక్క రోజులో కూడా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయడం అంటే కొంత రిస్కుతో కూడుకున్న పని కాబట్టి…
.. ఉద్యోగులు ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని కంపెనీ పలువురు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు….
మళ్లీ షెడ్యూల్ వెంటనే సాధ్యం కాదు కాబట్టి.. మరోసారి షెడ్యూల్ ని ప్రకటిస్తామని మంత్రి ఉత్తమ్ తెలపడం జరిగింది…