తెలంగాణ : పత్తి రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచనలు చేశారు. పత్తి పంటను మార్కెట్ యార్డు లేదా జిన్నింగ్ మిల్లులో విక్రయించేందుకు తీసుకురావడానికి ముందు పత్తి తేమ శతం 12 మించకుండా చూసుకోవాలని చెప్పారు. లేకపోతే కనీస మద్ధతు ధర పొందే అవకాశం ఉండదన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తేమ శాతం ఎక్కువ ఉన్నా పత్తి పంటను కొనాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహన్కు లేఖ రాసినట్లు తెలిపారు..
కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకముందే పత్తిలో తేమ శాతాన్ని రైతులు తనిఖీ చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సూచించారు. తేమ శాతం 12కు మించకూడదని తేమ శాతం (Moisture content) ఎక్కువైతే మద్దతు ధర లభించదన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తేమ శాతం ఎక్కువ ఉన్న కూడా పత్తిని కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. ఇవాళ మంత్రి తుమ్మల ఓ ప్రకటన విడుదల చేశారు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఈ మేరకు సెప్టెంబర్ లోనే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. కపాస్ కిసాన్ యాప్లో రిజిస్ట్రర్ చేసుకోవడం కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిక బృందాలు జిల్లాలో పర్యటిస్తుంటారని, ఏఈఓలు, మార్కెట్ సెక్రటరీలు, జిల్లా మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. పత్తి రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని, రైతులకు ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5779 ను వెంటనే సంప్రదించగలన్నారు.