సామాన్యులకు అదిరిపోయే న్యూస్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా LPG గ్యాస్ సిలిండర్ల డెలివరీకి సంబంధించిన కొత్త రూల్స్ మారబోతున్నాయి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లను ఆర్డర్ చేసేందుకు తప్పనిసరిగా OTP అవసరం. గ్యాస్ సిలిండర్ల దొంగతనాలను నివారించడంతో పాటు అసలైన వినియోగదారులను గుర్తించేందుకు చమురు కంపెనీలు కొత్త సిస్టమ్ అమలు చేస్తున్నాయి. డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) ద్వారా సిలిండర్ డెలివరీ అవుతుంది…వినియోగదారుడి మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోతే (LPG Gas Prices) డెలివరీ చేసే వ్యక్తి యాప్ ద్వారా రియల్ టైమ్లో అప్డేట్ చేసి కోడ్ను జనరేట్ చేస్తాడు. ఈ సిస్టమ్ రన్ చేయడంతో అడ్రస్ లేదా మొబైల్ నంబర్ తప్పుగా ఉన్నవారికి సమస్యలు వస్తాయి. తప్పుడు సమాచారం కారణంగా వారి గ్యాస్ సిలిండర్ల డెలివరీ నిలిపివేస్తారు.
క్యూఆర్ కోడ్ స్కానింగ్ :
100 స్మార్ట్ సిటీల తర్వాత ఈ కొత్త సిస్టమ్ ఇతర నగరాల్లో అమలు చేస్తున్నారు. అయితే, ఈ క్యూఆర్ కోడ్ ఓటీపీ సిస్టమ్ వాణిజ్య సిలిండర్లకు వర్తించదు. LPG సిలిండర్లపై QR కోడ్ల ద్వారా డెలివరీ ట్రాకింగ్ చేయనున్నారు. సబ్సిడీలు మీ ఆధార్-లింక్డ్ అకౌంటుకు నేరుగా బదిలీ అవుతాయి…