మార్కెట్లో కూరగాయల ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. గతనెల చివరి వారంతో పోల్చి చూస్తే పలు రకాల ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి కూరలో తప్పనిసరిగా వినియోగించే పచ్చిమిర్చి రేట్లు ఘాటెక్కిస్తున్నాయి..రెండు రోజుల్లోనే పూర్తి చేసుకుంటారు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు కొనుగోలు చేస్తారు. అందుకే వీకెండ్స్ లో హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి నగరాలతోపాటు చిన్న చిన్న పట్టణాల్లో కూరగాయల సంతలు జరుగుతుంటాయి. ఉద్యోగులు, గృహిణులు వారానికి సరిపడా కూరగాయలను కొనుగోలు చేస్తుంటారు..ప్రస్తుతం టమాటా ధరలు కిలోకు రూ. 30 నుండి రూ.40 వరకు ఉన్నాయి. గతంలో రూ.15–రూ.25 మధ్య ఉండగా ఇప్పుడు కొంత పెరుగుదల కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో టమాటా ధరలు ఇంకా పెరిగే అవకాశముందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు..ఉల్లిపాయ ధరలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మార్కెట్లో కిలో రూ.15–రూ.20 మధ్య లభిస్తోంది. వినియోగదారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నప్పటికీ, రైతులు మాత్రం వ్యాపారులు కిలోకు కేవలం రూ.1–రూ.2 మాత్రమే ఇస్తున్నారని ఆందోళన చెందుతున్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.