*అగ్ని బాధ్యత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం…*
*కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…*
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఆత్రేయపురం మండలం మేర్లపాలెంలో శనివారం తెల్లవారుజామున ప్రమాదాస్తు ఏర్పడిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన ములగలేటి వెంకన్న, కొమ్మర సుబ్బలక్ష్మి మరియు ములగాలేటి కుటుంబాలను ఓదార్చి స్వీయ నిధులు నుండి నగదుతో పాటు బియ్యం నిత్యవసర వస్తువులను అందజేశారు. ఇంటిలో గల అన్ని వస్తువులు కాలి బూడిదవడం కట్టుబట్టలతో మిగలడం చాలా బాధాకరమైన విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం నుండి రావలసిన సహాయాలను అందించే విధంగా కృషి చేస్తామని బాధ్యత కుటుంబాలకు హామీ ఇచ్చారు.