అమెరికా వీసా రద్దు అయిందని వైద్యురాలు ఆత్మహత్య ..

అమెరికా వీసా రద్దు అయిందని వైద్యురాలు ఆత్మహత్య

కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ చేసి మూడేళ్ల కిందట హెచ్ 1బీ వీసాపై అమెరికా వెళ్లిన గుంటూరుకు చెందిన కాకు రోహిణి(38)

అక్కడ ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగానికి ప్రయత్నించే క్రమంలో అందుకు సంబంధించిన మూడు దశల పరీక్షల్లో మంచి మార్కులు సాధించి, అబ్జర్వర్‌షిప్ మూడు సార్లు చేసి, రెసిడెన్సీ ప్రోగ్రామ్‌కు ఎంపికైన రోహిణి

అయితే కుటుంబసభ్యులను చూసేందుకని గత మేలో భారత్‌కు రాగా.. ఇంతలో అమెరికా వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేయడంతో హెచ్1బీ వీసాను జే1 వీసాగా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి దరఖాస్తు చేస్తే తిరస్కరించిన అమెరికా ప్రభుత్వం

దీంతో మనస్తాపం చెంది ఈ నెల 22న హైదరాబాద్‌లోని నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న రోహిణి….

అయితే, ఇటీవల ఆమె వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో తన భవిష్యత్ ఆశలు అడియాసలయ్యాయని భావించిన ఆమె, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీసా రాకపోవడం వల్లే రోహిణి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వస్థలమైన గుంటూరుకు తరలించారు. .