అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో.. బ్యాంకు ఖాతా, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించని పక్షంలో.. నామినేషన్ల పరిశీలన సమయం వరకు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ “ఇలా త్రిపాఠి” అన్నారు. తిప్పర్తి మండలంలోని.. తిప్పర్తి ,మామిడాల, పజ్జురు గ్రామ పంచాయతీలలో మొదటి విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు._
_నామినేషన్లు, అభ్యర్థులకు సమస్యలు ఎదురైతే హెల్ప్ డెస్క్ ద్వారా సూచిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించాలని.. ఒక అభ్యర్థి ఎన్ని సెట్లు నామినేషన్ వేస్తున్నారో వాటిని భద్రపరచాలని.. అభ్యర్థులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాలన్నారు. వచ్చిన నామినేషన్లన్నిటిని టీ-పోల్ యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు నామినేషన్ సమయంలో కుల ధ్రువీకరణపత్రాలు సమర్పించ లేకపోతే.. డిక్లరేషన్ ఫామ్ లో గెజిటెడ్ సంతకంతో సమర్పించి, కరెంట్ అకౌంట్ లేనట్లైతే పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్ ఇచ్చి నామినేషన్ల పరిశీలన లోపు ధ్రువీకరణ, బ్యాంక్ అకౌంట్ పత్రాలును అందజేయాలని
చెప్పారు._