చాలా కాలం నుండి రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో డేటింగ్ చేస్తున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నిన్న కోయంబత్తూరు లో వివాహం చేసుకుంది..ఈ పెళ్లి కి కేవలం సమంత , రాజ్ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు ఒక్కరికి కూడా రాలేదు. సమంత కి అత్యంత సన్నిహితంగా ఉండే ఉపాసన వంటి వారు కూడా ఇన్ స్టాగ్రామ్ లో సమంత అప్లోడ్ చేసిన పెళ్లి ఫోటోల ద్వారానే తెలుసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే సమంత పై మొదటి నుండి సోషల్ మీడియా లో నెగిటివిటీ విపరీతంగా ఉండేది. ముఖ్యంగా నాగచైతన్య(Akkineni Nagarjuna) తో ఆమె విడాకులు తీసుకోవడం పై నెటిజెన్స్ వేసిన ట్రోల్స్ కి సమంత ఏడ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు రాజ్ నిడిమోరు ని రెండవ పెళ్లి చేసుకోవడం పై కూడా ఆమెని తీవ్రంగా విమర్శిస్తున్నారు కొంతమంది నెటిజెన్స్.
ముఖ్యంగా నాగ చైతన్య ఒక సందర్భంలో విడాకులు గురించి మాట్లాడుతూ ‘అమ్మ నాన్న విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను చిన్నతనం నుండి చూస్తూ పెరిగాను. అలాంటిది నేను ఒక బంధం నుండి విడిపోవాలి అనుకున్నప్పుడు ఎన్ని వందల సార్లు ఆలోచించి ఉంటాను మీరే అర్థం చేసుకోండి’ అంటూ గతం లో ఒక పోడ్ క్యాస్ట్ ఛానల్ లో చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఈ వీడియో ని ఇప్పుడు సోషల్ మీడియా లో ఆయన అభిమానులు అప్లోడ్ చేస్తూ బాగా వైరల్ చేస్తున్నారు. దీన్ని చూసి నెటిజెన్స్ చైతన్య బంగారం లాంటి మనిషి, కచ్చితంగా సమంత వైపు నుండే తప్పు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 విడుదల సమయం లోనే నాగ చైతన్య సమంత తో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ ని ఆమె పెళ్లాడింది. అంటే తప్పు కచ్చితంగా సమంత వైపు నుండే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరో వైపు సమంత ఫ్యాన్స్ కూడా నాగ చైతన్య అభిమానులకు దీటైన సమాధానం ఇచ్చింది. సమంత తో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే నాగ చైతన్య శోభిత తో రిలేషన్ పెట్టుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటి?, నాగ చైతన్య తప్పు చేసాడు అనుకోవాలా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగింది అనే విషయం వాళ్లకు, దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి మీకు మీరు కథనాలు ఊహించుకోకండి, ఇప్పుడు ఇద్దరూ ఎలాంటి గొడవలు లేకుండా ఎవరి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు…
టాలీవుడ్
సినిమా
వార్తలు
లైఫ్స్టైల్
రాశి ఫలాలు
బిగ్ బాస్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ పథకాలు
టీవీ
టెక్నాలజీ
Web Stories
జాబ్స్
ఎడ్యుకేషన్
ఫోటో గ్యాలరీ
ప్రభుత్వ పథకాలు
వైరల్
స్పోర్ట్స్
బిజినెస్
ఎన్నికలు
ఆధ్యాత్మికం
వీడియో గ్యాలరీ
ఏది నిజం
ట్రావెల్
జోక్స్
బెస్ట్ డీల్స్
వెబ్ స్టోరీలు
telugu Newstelugu moviescinema newsNaga Chaitanya Post Goes Viral Amid Samantha Raj Wedding
Naga Chaitanya: సమంత – రాజ్ రెండో పెళ్లి.. నాగ చైతన్య పోస్ట్ వైరల్..
అగ్ర కథానాయిక సమంత, ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు వాటిని నిజం చేస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సమంత మాజీ భర్త నాగ చైతన్య వీడియో, ఆయన లేటెస్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత – రాజ్ పెళ్లి రోజే చైతన్య ఈ పోస్ట్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
Authored by: రాజశేఖర్. జి
Updated: 2 Dec 2025, 1:22 pm|Samayam Telugu
ఇప్పుడు ఫాలో చేయండి
అగ్ర కథానాయిక సమంత, ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీ సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్. దీంతో ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత – రాజ్ పెళ్లి చేసుకున్న నేపథ్యంలో అక్కినేని నాగ చైతన్య వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Naga Chaitanya Post Goes Viral amid Samantha Raj Wedding.
సమంత – రాజ్ రెండో పెళ్లి.. నాగ చైతన్య పోస్ట్ వైరల్..
ఏమాయ చేశావో సినిమాలో జంటగా నటించిన నాగ చైతన్య – సమంత రూత్ ప్రభు.. రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. 2017 అక్టోబర్ 6న పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. మూడున్నరేళ్ల పాటు అన్యోన్యంగా జీవించిన ఈ సెలబ్రిటీ కపుల్.. నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోకుండానే 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరూ ఎంతో ఆలోచించి, పరస్పర అంగీకారంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వేర్వేరు మార్గాల్లో ప్రయాణం చేయనున్నట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇద్దరిలో తప్పు ఎవరిది అంటూ నెటిజన్లు చర్చలు చేస్తూనే ఉన్నారు.
విడాకుల విషయంలో కొందరు సమంతకు సపోర్టుగా నిలిస్తే, మరికొందరు చైతన్యకి మద్దతుగా నిలిచారు. విడిపోవడానికి కారణాలు ఇవేనంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిపారు.. ఇప్పటికీ చర్చిస్తూనే ఉన్నారు. సామ్ విషయానికొస్తే, అనేక సందర్భాల్లో తన డివోర్స్ గురించి మాట్లాడింది. చాలా బాధ అనుభవించాలని ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. కొన్ని ఇంటర్వ్యూలలో తన మాజీ భర్తపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కాపీ విత్ కరణ్ జోహార్ షోలో తన మాజీ భర్తతో ఇంట్లో ఉండాల్సి వస్తే, అక్కడ పదునైన వస్తువులు ఏమీ లేకుండా చూసుకోవాలని కామెంట్స్ చేసింది