రేవంత్‌ రెడ్డి బిల్డప్‌ బాబాయ్‌ , ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే.. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు

రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) బిల్డప్‌ బాబాయ్‌ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు (Harish Rao) విమర్శించారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్‌ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిది ప్రైవేట్‌ లిమిటెడ్‌ పాలన అని, తన రెండేండ్ల పాలనలో చేసింది ఒక్కటైనా చెప్పగలడా అని ప్రశ్నించారు. ప్రజాభవన్‌ను (Praja Bhavan) జల్సాలకు, విందులు, వినోదాలకు ప్రజాభవన్‌ను కేరాఫ్‌గా మార్చారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ నేతలతో కలిసి రేవంత్‌ రెండేండ్ల పాలనపై తెలంగాణ భవన్‌లో హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్‌ పాలనలో రెండేళ్లుగా దోపిడీ తప్ప పారదర్శకత లేదు. ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్‌ రెండేండ్లలో చేసిందేమీ లేదు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీశారు. రెండేండ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గింది?. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో తెలంగాణను నంబర్‌ వన్‌గా నిలబెట్టాం. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అన్నారు..