Lionel Messi And CM Revanth Reddy Friendly Football Match .
కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సికి హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ రావడంతో అభిమానులు ఉర్రూతలూగారు. అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. మెస్సి మెస్సి అనే నివాదాలతో ఉప్పల్ మైదానం మారుమోగింది..
బ్యానర్లు పట్టుకొని ఫుట్ బాల్ దిగ్గజానికి స్వాగతం :
సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మెస్సి బృందానికి ఘనస్వాగతం లభించింది.క్రీడాభిమానులు పలువురు కాంగ్రెస్ నేతలు అయనకు అడుగడున స్వాగతం పలికారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాభిమానులు బ్యానర్లు పట్టుకొని ఫుట్ బాల్ దిగ్గజానికి స్వాగతం పలికారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మెస్సి బృందం ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లింది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెస్సికి స్వాగతం పలికారు. అనంతరం ఫలక్ నుమా ప్యాలెస్‌లో 100 మందితో ఏర్పాటు చేసిన ‘ మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో మెస్సి పాల్గొన్నారు. ఇందుకు ఒక్కొక్కరు పది లక్షల వెచ్చించి మెస్సి అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు…
మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నిర్వహించిన ఈ మ్యాచ్‌లో మెస్సీ టీమ్‌పై సింగరేణి ఆర్‌ఆర్ టీమ్ 3-0 గోల్స్‌తో గెలిచింది. ఆర్‌ఆర్ టీమ్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి ఆడి ఓ గోల్ కొట్టారు. ఇందులో మెస్సీ, రేవంత్ రెడ్డి ఆడింది 5 నిమిషాలపాటే. (Lionel Messi)
https://x.com/i/status/1999860082507694589
అనంతరం, ఇరు జట్లకు మెస్సీ పతకాలు అందజేశారు. ఇక్కడకు వచ్చి తెలుగు వారిని కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడి వారు చూపించిన అభిమానం ఎంతో శక్తినిచ్చిందని చెప్పారు…మ్యాచ్‌కి ముందు ఇరు టీమ్‌లతో మెస్సీ, రేవంత్ రెడ్డి ఫొటోలు దిగారు. ఈ మ్యాచ్‌ను రాహుల్ గాంధీ కూడా చూశారు. అలాగే, ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె కూడా స్టేడియానికి వచ్చారు….