తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించండి..సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్..

తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించండి..

సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్.

పరవాడ. ఫార్మా కాలుష్యంలో తీవ్రంగా అల్లాడుతున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని సిఐటియు ఆధ్వర్యంలో తాడి గ్రామంలో గురువారం నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ తాడి గ్రామం లో ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకొని తీవ్రమైన జబ్బులతో అల్లాడుతున్నారని వెంటనే గ్రామాన్ని తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు. భూగర్భ జలాలు నాశనం అయ్యాయని పర్యావరణం దెబ్బతిన్నదని మంచి గాలికి మంచినీరికి మంచి నేల కి ఈ ప్రాంత ప్రజలు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భాలు విచ్చమవుతున్నాయని గాఢమైన వాయువులతో ప్రజలు గ్రామంలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా తాడి గ్రామాన్ని తరలిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని గని శెట్టి డిమాండ్ చేశారు. తాడి గ్రామ ప్రజలకు సురక్షమైన ప్రాంతాలకు గ్రామాన్ని తరలించడానికి జీవో విడుదల చేయాలని గని శెట్టి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి సత్యనారాయణ, సిఐటియు నాయకులు ఎస్ వెంకటలక్ష్మి, కుమారి, పార్వతి, లక్ష్మీ, నాయకత్వంలో ఆందోళన చేశారు ఈ సందర్భంగా తాడి గ్రామాన్ని తరలించాలని, కాలుష్యం నుండి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని, నినాదాలు చేశారు.