బంగారం, వెండి ధరల దూకుడు తగ్గడం లేదు. అకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. తాజాగా… మరోసారి బంగారం, వెండి ధరలు దిమ్మతిరిగే షాకిచ్చాయి. ఫలితంగా కిలో వెండి రేటు రూ.రెండున్నర లక్షలకు చేరువవుతోంది…గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.330 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.300 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 30 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సుగోల్డ్ 4,331 డాలర్ల వద్ద కొనసాగుతోంది..గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.330 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.300 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 30 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సుగోల్డ్ 4,331 డాలర్ల వద్ద కొనసాగుతోంది..మరోవైపు వెండి ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. కిలో వెండిపై బుధవారం రూ.11వేలు పెరగ్గా.. ఇవాళ (గురువారం) రూ. 2వేలు పెరిగింది. దీంతో కిలో వెండి రూ. 2,24,000 వద్దకు చేరుకుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,23,750 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,34,990కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,23,600 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,34,840కు చేరింది..