వ్యవసాయానికి కావాల్సింది యూరియా, నీళ్లు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యాప్‌లు, మ్యాప్‌లు కావాలని అంటుంది
యూరియా సరఫరా చేయడం చేతగాక ప్రభుత్వం యాప్‌లు, మ్యాప్‌ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటుంది
తక్షణమే దీన్ని విరమించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాము
రైతులు వ్యవసాయం చేయాలా యాప్ చుట్టూ, మ్యాప్ చుట్టూ తిరగాలా.. రైతులకు వ్యసాయం చేయడమే తెలుసు, ఈ యాప్‌లు గీప్లు తెలియవు
మళ్లీ ఒరిజినల్ రైతు అంట కౌలు రైతులకు కౌలు ఇచ్చినట్లు రాసిస్తే అప్పుడే యూరియా ఇస్తానని ప్రభుత్వం చెబుతుంది
దీంతో వాళ్ళు కౌలు ఇవ్వడమే బంద్ చేస్తారు.. దీనివల్ల లక్షలాది మంది కౌలు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది – హరీష్ రావు..
ముఖ్యమంత్రి సొంత గడ్డపై కాంగ్రెస్ ప్రలోభాలను తట్టుకొని నిలబడిన వంగూరు మండల సర్పంచ్‌లతోపాటు గజ్వేల్ నియోజకవర్గ సర్పంచ్‌లను ప్రత్యేకంగా అభినందించి, శాలువాలతో సతరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. నాడు ఢిల్లీలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా జాబితా ఉండేది కాదని, కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో తెలంగాణకు ఒక అవార్డు కూడా రాలేదని చెప్పారు. పల్లెలు అపరిశుభ్రంగా మారాయని, కనీసం కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ఆనాడు కేసీఆర్ ప్రతినెలా పల్లెలకు నిధులు విడుదలచేసేవారని చెప్పారు. రేవంత్‌రెడ్డి వచ్చాక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు బంద్ అయ్యాయని దుయ్యబట్టారు…