న్యూ ఇయర్ వచ్చేస్తోంది…న్యూ ఇయర్ వేళ పోలీసు వారి నిబంధనలివే..!

మరో 10 రోజుల్లో పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి, కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నాం. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ నూతన ఉత్సాహంతో ఉంటారు. అందుకు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. ఎక్కడికి వెళ్లాలి? ఏ ప్రదేశానికి వెళితే బాగుంటుంది? ఏవైనా కొత్త ప్రదేశాలకు వెళితే బాగుంటుందా? స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామా? కుటుంబంతో కలిసి ఏవైనా పుణ్యక్షేత్రాలకు వెళదామా? అని ముందునుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అందుకు అనుగుణంగానే టూర్లకు ప్లాన్ చేసుకుంటూ నూతన ఏడాది మధుర జ్ఞాపకాలను వారి జీవితాల్లో పదిలం చేసుకుంటారు.

నూతన సంవత్సరం ఆరంభాన్ని మధురంగా మలచుకునేందుకు రాష్ట్రవాసులు సిద్ధమవుతున్నారు. డిసెంబరు 31, జనవరి 1న పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలను వేసుకుంటున్నారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, ఆలయాలను సందర్శించేలా అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. అభిరుచులకు అనుగుణంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, గోవా రాష్ట్రాల్లో వివిధ ప్రదేశాలను తిలకించేందుకు ఎంపిక చేసుకుంటున్నారు. కొందరైతే పర్యాటక ప్యాకేజీల కోసం ప్రముఖ సంస్థలను సంప్రదిస్తున్నారు…

ఇక యువత రోడ్లపై చిందులు వేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు మరికొందరు విదేశాలలో పర్యటిస్తూ.. అక్కడే ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు..

బ్రెజిల్ – రియో డి జనీరో

రియో డి జనీరోలో నూతన సంవత్సర వేడుకలు సముద్ర తీరంలో జరగడం ప్రత్యేకత. ప్రజలు తెల్ల దుస్తులు ధరించి, బీచ్‌లపై చేరి సంగీతం, నృత్యాలతో ఆనందిస్తారు. అర్థరాత్రి అద్భుతమైన ఫైర్‌వర్క్స్‌తో ఆకాశం వెలుగులతో నిండిపోతుంది..

జపాన్ – టోక్యో

టోక్యోలో నూతన సంవత్సరం వేడుకలు సంప్రదాయ పద్ధతుల్లో జరుగుతాయి. ఆలయాల్లో ప్రార్థనలు అదే సమయంలో ఆధునిక నగర ప్రాంతాల్లో లైటింగ్ షోలు, ఈవెంట్లు కూడా జరుగుతాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – దుబాయ్

దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా ఉంటాయి. బుర్జ్ ఖలీఫా చుట్టూ జరిగే లేజర్ షోలు, ఫైర్‌వర్క్స్ ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తాయి..

భారత్ లో కొంతమంది ఇలా..

ఎంచుకుంటున్న అంశాలు : దేవాలయాలు, హిల్ స్టేషన్లు, బోటింగ్, రిసార్టులు, ప్రకృతి సందర్శనీయ స్థలాలు, బీచ్లు.

పర్యాటక ప్రదేశాలు : గోవా, విశాఖపట్నం, అరకు, దండేలి, ఊటీ, భద్రాచలం, పాపికొండలు, హంపీ, మున్నార్, మైసూర్.

ఆలయాలు : శ్రీశైలం, విజయవాడ, షిరిడీ, భద్రాచలం, తిరుపతి సహా ప్రధాన గుడులు ఉన్నాయి..

న్యూ ఇయర్ వేళ పోలీసు వారి నిబంధనలివే:.

న్యూ ఇయర్ వేడుకలకు ఎక్కడా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.

న్యూ ఇయర్ వేడుకలు జరిగే ప్రాంతంలో ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలి.
పార్టీల్లో అశ్లీల డ్యాన్సులు, అసభ్యత ఉండకూడదు.
గెస్ట్ల భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు సిబ్బందిని నియమించుకోవాలి.
ఇండోర్లో అర్ధరాత్రి 1 గంట వరకు తక్కువ శబ్దం (45 డెసిబుల్) సౌండ్ మాత్రమే వచ్చేలా చూసుకోవాలి.
బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటలకు నిలిపివేయాలి.
వెహికల్ పార్కింగ్కు తగిన ఏర్పాట్లు చేయాలి.
పార్టీల్లో బాణాసంచాకు అనుమతి లేదు.
మత్తు పదార్థాలు (డ్రగ్స్) విక్రయించినా, వాడినా కేసులు తప్పనిసరి.
పబ్లు, బార్లలో మైనర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు.
వేడుకల్లో ప్రాంతం కెపాసిటీకి మించి పాస్లు, టికెట్లు, కూపన్లు జారీ చేయరాదు.