1969వ ఎస్ఎస్సి(NSP) మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు 1969 వ సంవత్సర ఎస్ఎస్సి మొదటి బ్యాచ్ అయిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కుటుంబ సభ్యుల తోటి అత్యంత వైభవంగా జరుపుకున్నాము ఈ సమ్మేళనంలో పూర్వ విశ్రాంతి ఉపాధ్యాయుడైన అర్వపల్లి రంగారావు గారు సమక్షంలో మన 1969 బ్యాచ్ సంబంధించిన విద్యార్థులు అందరు కలిసి వారికి సన్మాన కార్యక్రమం చేసి వారి పూర్వ అనుభవాలను స్కూలు సంబంధించిన పూర్వ ఉపాధ్యాయులైన వారందరినీ స్మరించి సకుటుంబంగా అందరు విచ్చేసి కార్యక్రమంలో గత 56 సంవత్సరాల కింద ఇదే స్కూల్లో ఎస్ఎస్సి చదివి వారి అనుభవాలను ముందు తరాలకు ఏ విధంగా ఆదర్శంగా ఉండాలని ప్రతి ఒక్కరూ వారికి సంబంధించిన అనుభవాలను పంచుకుంటూ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించుకున్నారు. అర్వపల్లి రంగారావు, వీళ్లను చూసి ఎంతగానో సంతోషించి మురిసిపోయారు
ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులైన అర్వపల్లి రంగారావు, విద్యార్థులైన ముడుంబ జగన్నాథచార్యులు వర్ర వెంకట్ రెడ్డి, మూసం సత్యనారాయణ, కోట హరిప్రసాద్, కే నాగేశ్వరావు , వీర్లపల్లి రామారావు, ఓరుగంటి మోహన్ రావు, మొదల పూర్వ విద్యార్థులందరూ విజయవంతంగా జరుపుకున్నారు