బంగ్లా దేశీయులు భారత్లోకి స్థిరపడేందుకు కాంగ్రెస్ సాయం….నరేంద్ర ప్రధానమంత్రి మోదీ..

దేశవ్యతిరేక కార్యకలాపాలతో పాటు అక్రమంగా బంగ్లా దేశీయులు భారత్​లోకి స్థిరపడేందుకు సాయం చేస్తున్నారంటూ కాంగ్రెస్​పై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలను వినే నాథుడే లేకుండాపోయాడని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతు సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. అసోంలో రెండో రోజూ పర్యటించిన ప్రధాని మోదీ, డిబ్రూగడ్‌లో రూ. 10 వేల 601 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన బ్రౌన్‌ ఫీల్డ్ యూరియా ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ‘ది అస్సాం వ్యాలీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్‌’ 2030 నాటికి ఏటా 12.7లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఈ యూరియా ప్లాంట్‌ను నిర్మించనుంది. కాంగ్రెస్‌ పాలనలో సాంకేతికత పాతదైపోయి ఎరువుల ప్లాంట్‌లు మూతపడినప్పటికీ పట్టించుకోలేదని ప్రధాని దుయ్యబట్టారు. 2014లో దేశంలో యూరియా ఉత్పత్తి 225 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా పది, 11 ఏళ్లు కష్టపడిన తర్వాత అది 306 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని మోదీ వివరించారు…
అసోం మాదిరిగానే దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ( కాంగ్రెస్ పాలనలో‌) అనేక యూరియా పరిశ్రమలు మూతపడ్డాయి. అప్పుడు రైతులు పడిన కష్టాలు గుర్తుకు తెచ్చుకోండి. యూరియా కోసం రైతులు బార్లు తీరేవారు. యూరియా దుకాణాల్లో పోలీసులను మోహరించేవారు. రైతులపై లాఠీఛార్జ్‌ చేసేవారు. కాంగ్రెస్ చెడగొట్టిన ఈ వ్యవస్థలను సరిచేసేందుకు మా ప్రభుత్వం మొత్తం శక్తినంతా ఉపయోగిస్తోంది. ఎంతచేసినా సరే 11 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మేము చేయాల్సింది చాలా ఉండిపోయింది. కాంగ్రెస్‌ పాలనలో యూరియా పరిశ్రమలు మూతపడ్డాయి. మా ప్రభుత్వం గోరఖ్‌పూర్, సింద్రీ, బరౌనీ, రామగుండం వంటి అనేక ప్లాంట్లను తిరిగి ప్రారంభించింది. ఈ చర్యల వల్ల యూరియా రంగంలో స్వయం స్వావలంబన సాధించే దిశగా బలమైన అడుగులు పడుతున్నాయి. అని నరేంద్ర ప్రధానమంత్రి మోదీ, అన్నారు..