హైదరాబాద్: శంషాబాద్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా..
_• ముందున్న వాహనాన్ని తప్పించబోయి స్కూల్ బస్సు బోల్తా.. స్కూల్ బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు.. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు.. శంషాబాద్ నుంచి హైదరాబాద్ జలవిహార్ కి పిల్లల్ని తీసుకు వస్తున్న బస్సు..ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ నుంచి హైదరాబాద్లోని జలవిహార్కు పిల్లలను పిక్నిక్కు తీసుకెళ్తున్న రిషి స్కూల్ బస్సు బోల్తా పడింది. ముందున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం కారణంగా పలువురు విద్యార్థులు గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా శంషాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.