2026 అండర్-19 వరల్డ్ కప్ భారత జట్టు ప్రకటన.
నమీబియా, జింబాబ్వే వేదికగా..
జనవరి 15 నుంచి అండర్-19 వరల్డ్ కప్
కెప్టెన్గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్గా విహాన్
జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు.
ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా యువ జట్టును శనివారం అధికారికంగా ప్రకటించారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీకి జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిస్తున్నాయి. కాగా ఈ ప్రపంచ కప్నకు ముందు టీమిండియా అండర్ 19 జట్టు సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది…
ముంబైకి చెందిన డాషింగ్ ఓపెనర్ ఆయుష్ మాత్రే ఈ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. వైస్ కెప్టెన్గా విహాన్ మల్హోత్రా ఎంపికయ్యాడు. ఇటీవల తన అద్భుతమైన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ మెగా టోర్నీలో చోటు దక్కింది. జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించే ఈ టోర్నీ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. రికార్డు స్థాయిలో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత్, ఆరోసారి కప్పు కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. గ్రూప్-బిలో ఉన్న భారత్… అమెరికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో తలపడనుంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ముందుగా దక్షిణాఫ్రికాలో పర్యటించి అక్కడ వన్డే సిరీస్ ఆడనుంది…
ఐదు సార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్ (2000, 2008, 2012, 2018, 2022)ను గ్రూప్–బీలో న్యూజిలాండ్, అమెరికా (యూఎస్ఏ), బంగ్లాదేశ్లతో కలిసి ఉంచారు. భారత్ తన తొలి మ్యాచ్ను జనవరి 15న బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో యూఎస్ఏతో ఆడనుంది. అదే మైదానంలో జనవరి 17న బంగ్లాదేశ్తో, జనవరి 24న న్యూజిలాండ్తో పోటీ పడుతుంది..
గమనిక..
మీ ప్రాంతంలో A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959