రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చిగురిస్తున్న వేళ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు తీవ్ర కలకలం రేపాయి. సోమవారం అర్ధరాత్రి పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు జరిగాయి..
Russia accused Ukraine on attack President Vladimir Putin’s residence in northern Russia,
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందనే వార్తలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి దౌత్య ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని రెండు దేశాలను కోరారు.
“రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే నివేదికలతో తీవ్ర ఆందోళన చెందుతున్నాను. కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు శత్రుత్వాలను అంతం చేయడానికి, శాంతిని సాధించడానికి అత్యంత ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తాయి. ఈ ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని మరియు వాటిని దెబ్బతీసే ఏవైనా చర్యలను నివారించాలని కోరుతున్నాము” అని ప్రధాని మోదీ Xలో ఒక పోస్ట్లో రాశారు…
ట్రంప్..
ఇదే విషయంపై ట్రంప్ కూడా స్పందించారు. పుతిన్ నివాసంపై దాడి వార్తలు తెలియగానే పుతిన్కు ట్రంప్ ఫోన్ చేసి విషయాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ఇలా జరగడం మంచిది కాదన్నారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా ఇలా జరగడం భావ్యం కాదన్నారు. పుతిన్ నుంచి విషయం తెలుసుకోగానే.. చాలా కోపంగా ఉన్నట్లు చెప్పారు.
షెహబాజ్ షరీఫ్
ఇక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పుతిన్ నివాసంపై దాడిని ఖండించారు. శాంతి భద్రతలకు ముప్పు కలిగించే అన్ని రకాల హింసలను పాకిస్థాన్ తిరస్కరిస్తుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి హేయమైన చర్య శాంతి, భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని చెప్పారు. రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు పాకిస్థాన్ సంఘీభావాన్ని తెలిపింది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959