కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఒకే ప్రెస్మీట్లో విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీకి రావడం, గౌరవం అంశాలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని సంజయ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి..
కాంగ్రెస్ నేతలపై కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విమర్శలు చేశారు. ఈ ఏడాదైనా కాంగ్రెస్ నాయకులకు వివేకం కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని, అవి నిలిపివేయాలని కోరారు. రాజకీయ ప్రత్యర్థులను దూషించడం తమ సంస్కారం కాదని సంజయ్ తెలిపారు..అంతేకాకుండా
నీటి సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సరైన సలహాదారు అవసరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అడ్వైజర్‌ను తొలగించి, తెలంగాణపై అవగాహన ఉన్న వ్యక్తిని అడ్వైజర్‌గా నియమించాలని సూచించారు. పక్క రాష్ట్రాలతో ఉన్న నీటి వివాదాలు పరిష్కారమవ్వాలంటే తెలంగాణ సోయి ఉన్నవాడు సలహాదారుగా ఉండాలన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959