కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడుగల్ గ్రామంలో చిరుతల సంచారం స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తోంది. సమీపంలోని కొండ ప్రాంతం నుంచి గ్రామంలోకి ప్రవేశించేందుకు రెండు చిరుతలు యత్నించినట్లు స్థానికులు తెలిపారు.
ఈ విషయం గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై హడావుడి చేయడంతో, చిరుతలు తిరిగి కొండ ప్రాంతాల్లోకి వెళ్లినట్లు సమాచారం. అయితే, ఎప్పుడైనా మళ్లీ గ్రామంలోకి రావచ్చన్న భయంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పరిసర ప్రాంతాల్లో చిరుతల సంచారం కొనసాగుతుండటంతో అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, చిరుతలను బంధించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959